అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హీరో అల్లు అర్జున్ కు రఘు అలియాస్ పుష్పరాజ్ పెద్ద అభిమాని అని వెల్లడించారు. రఘు నుంచి ఐదు మొబైల్ లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 ఈ మెయిల్స్ వాడి ఎక్స్ ఖాతాలను తెరిచారని వెల్లడించారు.