టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయిన విమానం.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో
అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిన విషయం తెలిసిందే. పెద్ద శబ్దం చేస్తూ నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వ్యాపించాయి. సంఘటన స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. ఆ ప్రమాద వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ-అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు జనావాసాల మీద పడటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.