మద్యం ధరలు పెంచేసిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర మద్యం ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మద్యం ధరలు పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు బ్రాండ్లపై ఫుల్ బాటిల్ కు రూ.40 చొప్పున బాదేసింది. అంటే క్వాటర్ బాటిల్ తీసుకుంటే పది రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫుల్ బాటిల్ తీసుకుంటే రూ.40 అదనంగా ఇవ్వాలి.