కార్పొరేషన్ రుణాల దరఖాస్తుకు రేపే చివరి తేదీ
స్వయం ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసే సంగతి తెలిసిందే. బీసీ, ఈబీసీ వర్గాల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సాగుతోంది.
అందుకు ఈ నెల 7వ తేదీ (శుక్రవారం) వరకు అవకాశం ఉంది. లబ్ధిదారులు https://apobmms .apcfss.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.