టీవీ యాంకర్‌ను లైవ్‌లో ముద్దుపెట్టిన ఆకతాయి. షాకింగ్ వీడియో.

News Published On : Thursday, November 28, 2019 07:57 AM

టీవీలో ప్రత్యక్ష ప్రసారమవుతుండగా న్యూస్ ప్రెజెంటర్‌ను బుగ్గ మీద ముద్దు పెట్టినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన అమెరికాలోని లూయిస్‌విల్లేలో చోటు చేసుకుంది. సారా రివెస్ట్ అనే మహిళా న్యూస్ ప్రెజెంటర్ లైవ్ ప్రసారం అందిచేస్తుండగా ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఒక్క క్షణం రిపోర్టర్ షాక్ కి గురి అయింది. ముద్దు పెట్టుకున్న వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో కలత చెందిన సారా పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తినిగుర్తించి పట్టుకున్నారు.