గ్యాస్ రాయితీపై కీలక అప్డేట్
ఏపిలో 'దీపం-2' పథకం కింద మూడో విడతలో గ్యాస్ సిలిండర్ రాయితీ సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో ముందుగానే జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం నాడు సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన సచివాలయం నాలుగో బ్లాక్ లోని ప్రచార విభాగంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.