త్వరలో కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!
చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ తలుపులు మే 2న అధికారికంగా తిరిగి తెరుచుకుంటాయని శ్రీ బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి) ప్రతినిధి తెలిపారు. అలాగే మే 04వ తేదీన బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామని తెలిపారు. వీటితో పాటుగా రెండో కేదార్ గా పిలువబడే మద్మహేశ్వర్ ఆలయ తలుపులను మే 21వ తేదీన, మూడో కేదార్ తుంగ గుడిని మే 2న తెరుస్తామని ప్రకటించారు.