కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి హుందాయ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్న జగన్ సర్కారు

News Published On : Wednesday, March 4, 2020 05:23 PM

అమరావతి: గతేడాది డిసెంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం కడపజిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంకు శంకుస్థాపన చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే ఈ స్టీల్ ఫ్యాక్టరీలో కొరియా స్టీల్ కంపెనీ హుందాయ్ స్టీల్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం హుందాయ్ స్టీల్ కంపెనీల మధ్య ఒప్పందం త్వరలో జరగనున్నట్లు తెలుస్తోంది.

కడప జిల్లాలో ఏర్పాటు అయ్యే స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్షిప్‌ కింద ఏర్పాటు కానుంది. ఇందులో ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్, ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు హుందాయ్ స్టీల్ కంపెనీలు భాగస్వాములుగా ఉంటాయి.