కాగ్నిజెంట్ లో 20 వేల ఉద్యోగ నియామకాలు

News Published On : Friday, May 2, 2025 10:35 AM

ప్రముఖ అమెరికా ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఫ్రెషర్లకు శుభవార్తను అందించింది. ప్రస్తుత సంవత్సరంలో సుమారు 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ వృద్ధి ప్రణాళికలు, ఆవిష్కరణలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ భారీ నియామకాలకు సిద్ధమైనట్లు కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తెలిపారు.