ఇక చార్జీల మోత, బాదుడు మొదలెట్టిన జియో!

News Published On : Thursday, October 10, 2019 04:33 PM

ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీ కాల్స్‌ సదుపాయం అందిస్తున్న రిలయన్స్‌ జియో ఇంక చార్జీల మొదలు పెట్టనుంది, ఇదే విషయాన్ని ప్రకటించి ఝలక్ ఇచ్చింది. ఇక నుంచి జియో మినహా ఏ ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేసినా నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు వసూలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలకు సంబంధించి చార్జీల విధింపునకు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ కారణమని ఒక ప్రకటనలో వివరించింది.

బుధవారం నుంచి ఈ చార్జీలు అమల్లోకి రానున్నాయి . జియో కస్టమర్ల నుంచి వసూలు చేసే ఈ ఐయూసీ చార్జీలను ఇతర టెలికం కంపెనీలకు చెల్లిస్తుంది అని పేర్కొన్నారు. దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్‌-అప్‌ వోచర్స్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టాప్‌ అప్‌ వోచర్స్‌ విలువకు సరిసమానమైన డేటాను ఉచితంగా ఇవ్వటం వలన యూజరుపై చార్జీల భారం ఉండబోదని జియో తెలిపింది. కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగనున్నట్లు పేర్కొంది.

అయితే 6 పైసలు చార్జీలకు గానూ యూజర్లుకు అదనపు డేటా అందిస్తామని జియో సంస్థ తెలిపారు .దీంతో కస్టమర్లకు టారిఫ్ పెరిగినట్టు భావించొద్దని తెలిపారు . జియో నుంచి జియోకు, ల్యాడ్ లైన్స్‌కు, వాట్సాప్ కాల్స్ వంటి వాటికి ఎలాంటి అదనపు చార్జీలు ఉండదు అవి అన్ని ఉచితమే అని వెల్లడించారు. జియో కస్టమర్లు ఇకమీదట ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్ ఐడియా నెంబర్లక కాల్ చేసుకోవాలంటే అదనపు టాపప్ వోచర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. వీటి ధర రూ.10, రూ.20, రూ.50, రూ.100గా ఉంది. ఇదే కొనసాగితే జియో సంస్థ పై భారీగా ప్రతికూల ప్రభావం పడనుంది.