దెబ్బతిన్న జగన్ హెలికాప్టర్.. లోపం ఎవరిది..?
మాజీ ముఖ్యమంత్రి యస్ జగన్ మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటనలో ఆయన ప్రయాణించే హెలికాప్టర్ దెబ్బతింది. ఈ విషయాన్ని వైసీపీ ట్వీట్ చేసింది. జగన్ రామగిరి పర్యటనలో భద్రతా లోపం కనిపించిందని YCP ట్వీట్ చేసింది.
'జగన్ దిగే హెలిపాడ్ వద్ద పోలీసులు సరిపడా బందో బస్తు ఏర్పాటు చేయలేదు. జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశ పూర్వకంగానే భద్రత కల్పించడం లేదు.' అంటూ ఆ ట్వీట్ లో పేర్కొంది. జగన్ కు తగిన భద్రత ఇవ్వాలంటూ ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపింది.