మిస్సైల్ ను పరీక్షించిన భారత నేవీ.. యుద్ధానికి సిద్ధం
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు పెరుగుతున్నాయి. సరిహద్దులో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీనికి ధీటుగా భారత్ సైతం సమాధానమిస్తోంది. ఇదే సమయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. సముద్ర జలాల్లో భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధంగా ఉందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.