పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత ఆర్మీ
సరిహద్దుల వెంట పాకిస్థాన్ ఆర్మీ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి కూడా కుప్వారా, బారాముల్లా జిల్లాలతోపాటు అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులకు తెగబడినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. వీటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం రోజూ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే.
పహల్గామ్ జరిగిన ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం పాకిస్తాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఈ ఘటనపై పాకిస్తాన్ దారుణమైన విధంగా స్పందిస్తోంది, కాగా ఆ దేశం యుద్ధానికి దారితీసే చర్యలు తీసుకోవడాన్ని నివారించేందుకు రష్యా, చైనా సాయం కోరుతోందని తెలుస్తోంది.