ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్..?
జమ్మూ కశ్మీర్ పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటి అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రదాడికి తప్పక బదులివ్వాలని, గతంలో మాదిరి ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఏరివేసి ప్రతీకారం తీర్చుకోనున్నట్లు సమాచారం. 2019 లో పుల్వామ ఎటాక్ కు బదులుగా భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయం తెలిసిందే.