పాకిస్తాన్ ను మరో గట్టి దెబ్బ కొట్టిన భారత్
పాకిస్తాన్ ను భారత్ మరో గట్టి దెబ్బ కొట్టింది. భారత్ లోని పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ ను కేంద్రం నిషేధించింది. 16 యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్రం నిషేధం విధించింది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సహా పలువురు పాకిస్తానీయుల ఛానల్స్ పై కేంద్రం నిషేధం విధించింది. ఇటీవల జరిగిన పహాల్దాం దాడిలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.