ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

News Published On : Wednesday, December 5, 2018 04:38 PM

జగన్‌మోహన్‌రెడ్డిపై  జరిగిన దాడి విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాశ్రయం లాంజ్ లో శ్రీనివాస్ అనేవ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కేంద్రానికి తెలియజేయక పోవడాన్ని కోర్టు తప్పుపట్టింది.

జగన్‌పై దాడి కేసును బుధవారం మరోసారి విచారించిన ధర్మాసనం ముందు ఏపీ సర్కారు తరపున అడ్వకేట్‌ జనరల్‌ తన వాదనలు వినిపించారు. ఈ కేసుకు సెక్షన్‌ 3 వర్తించదని, వ్యక్తిగత దాడిగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేపడుతుందన్న అడ్వకేట్‌ జనరల్‌ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించ లేదు. ఈ కేసును ఎన్‌ఐఏకు ఇవ్వాలా, వద్దా అన్న విషయంపై ఈనెల 14వ తేదీలోగా నిర్ణయించి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.