మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు: వాతావరణ శాఖ

News Published On : Monday, January 28, 2019 05:32 PM

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 1500 మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా 1500 మీటర్ల ఎత్తు వద్దగల ఉపరితల ద్రోణి బలహీనంగా మారుతోందని, ఇప్పటికే అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులపాటు ఇదే విధంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.