ఆసుపత్రిలోనే తాళి కట్టిన వరుడు (Video)
ఆసుపత్రిలో ఉన్న వధువు మెడలో వరుడు తాళి కట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్ లోని బియోరా పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పెళ్లికి ముందు వధువు నందిని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో వైద్యులు ఆమెను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఈ ముహూర్తం పోతే రెండేళ్ల వరకు ఆగాల్సి వస్తుందని పురోహితులు చెప్పడంతో పెళ్లి కొడుకు ఆదిత్య మేళతాళాలతో ఆస్పత్రికి వచ్చి తాళి కట్టాడు.