55,418 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు
తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 55,418 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గత 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 58,868 పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు మరో 55,418 ఉద్యోగాలను భర్తీ చేస్తే ఈ సంఖ్య 1.14 లక్షలకు చేరుతుందని తెలిపారు. దీంతో ఉద్యోగాల భర్తీలో రికార్డు సృష్టించినట్లు అవుతుందని చెప్పారు.