డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి నెలలోపు రాష్ట్రంలోని 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.61,964 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక మద్దతుతో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు వీలవుతుంది. అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్, పశుసంపద, సెరికల్చర్ వంటి కీలక రంగాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.