టెక్ ఉద్యోగులకు బిగ్ షాక్
ఇండియాలోని ఉద్యోగులకు గూగుల్ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఇండియాలో భారీగా ఉద్యోగుల తొలగింపుకు గూగుల్ సిద్ధమవుతోంది. బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లోని ఉద్యోగుల తొలగింపునకు రెడీ అవుతోంది. యాడ్స్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో లే ఆఫ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. తాజాగా ఖర్చు తగ్గింపులో భాగంగా లేఆఫ్స్ ప్రకటన చేయనుంది. అయితే గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.