ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్ బంకులు నడపడానికి అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 25 జిల్లాల్లో ఒక్కొక్క పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా సంఘాల పొదుపు నిధులతో ఖర్చు భరిస్తారు. ప్రభుత్వం స్థలం, రూ.1 లక్ష సాయం, వ్యాపార అభివృద్ధికి సహకారం అందిస్తుంది, మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఈ పథకం అమలవుతుంది.