EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్
ఖాతాదారులు తమ PF అకౌంట్లను సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు వీలుగా EPFO కీలక నిర్ణయం తీసుకుంది. రివాంప్డ్ 13 సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీని అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. అంటే గతంలో లాగా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే రెండు కంపెనీలూ ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు. పాత కంపెనీ ఆమోదం తెలపగానే ఆటోమేటిక్ గా ప్రస్తుత కంపెనీ ఖాతాకు బదిలీ అవుతుందని స్పష్టం చేసింది.