షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.2,400 పెరిగి రూ.97,420కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.89,300 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.3000 పెరిగి రూ.1,11,000 గా ఉంది.