మళ్లీ తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త వచ్చింది. బంగారం ధరలు వరుసగా దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పతనం అవుతూనే ఉన్నాయి. ఇవాళ గోల్డ్ రేటు రూ.200 తగ్గగా ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 87,550 కి దిగొచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.220 తగ్గడంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.95,510 కి పడిపోయింది.