స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి, రూ.89,440కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి, రూ.97,570గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.1,09,900గా అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.