మళ్ళీ పెరుగనున్న చమురు ధరలు ?

News Published On : Monday, December 3, 2018 04:45 PM

ఇప్పుడిప్పుడే దిగి వస్తున్న ముడి చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  డిసెంబర్ 6న ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఓపెక్)తోపాటు రష్యా పాల్గొనే సమావేశంలో చమురు ఉత్పత్తిని తగ్గించాలన్న నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఓపెక్ నుంచి తప్పుకుంటున్నట్లు ఖతార్ ప్రకటించింది. జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్ కాబి వెల్లడించారు. 

చమురు ఉత్పత్తిలో అంతర్జాతీయంగా ఖతార్ ప్రముఖ పాత్ర పోషించడంతోపాటు దీర్ఘకాలిక వ్యూహంపై ఈ మధ్య నిర్వహించిన సమీక్షలో ఓపెక్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు సాద్ తెలిపారు. ఇక అటు అమెరికా, చైనా మధ్య 90 రోజుల పాటు వాణిజ్య యుద్ధానికి తెరపడటంతో సోమవారం చమురు ధరలు ఐదు శాతం మేర పెరిగాయి. ఇప్పుడు ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గిస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.