Breaking: వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో నందిగం సురేష్‌ను తుళ్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు.
నందిగం సురేష్ అరెస్ట్‌పై ఆయన భార్య బేబీ లత తీవ్రంగా స్పందించారు. పోలీసు స్టేషన్ వద్ద పోలీసులతో బేబీ లత వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.