ఉగ్రవాదంతో బంధం ఉంది.. అంగీకరించిన పాక్ మాజీ మంత్రి
పహల్గామ్ దాడి తర్వాత భారత్ పై పిచ్చి కూతలు కూస్తున్న పాకిస్తాన్ మధ్యలో నోరుజారి నిజాలను మాట్లాడుతుంది. ఈ మేరకు ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ కు ఉన్న సంబంధాలు నిజమేనంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఓ ప్రసంగంలో అంగీకరించారు. ఉగ్రవాదం కారణంగా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని బిలావల్ భుట్టో వెల్లడించారు. పాక్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిదని ఆయన పేర్కొన్నారు