Breaking: మాజీ డీజీపీ దారుణ హత్య
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారు. బెంగళూర్లోని ఆయన నివాసంలో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శరీరంలో పలు చోట్ల కత్తిపోట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఆయనను భార్యే చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి 2017 వరకూ కర్ణాటక డీజీపీగా ఓం ప్రకాశ్ పనిచేశారు.