మరో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్

News Published On : Sunday, June 15, 2025 08:15 AM

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలడంతో ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రతికూల వాతావరణమే ఘటనకు కారణంగా స్థానిక పోలీసులు భావిస్తున్నారు. సంఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.