మెగా DSC: వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమయంలో ఫీజు కట్టే విషయంలో కొందరు అభ్యర్థులకు గందరగోళం నెలకొంది. గత ఏడాది వైసీపీ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నోటిఫికేషన్ లో తెలిపింది. కేవలం అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయాలి. గతంలో కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే పోస్టుకు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.