Breaking: పాకిస్తాన్ లో భూకంపం
పాకిస్తాన్ లో బుధవారం భూకంపం సంభవించింది. ఖైబర్ పఖుంఖ్వాలోని స్వాత్ తో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.4గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఆదివారం సైతం అదే ప్రాంతంలో భూకంపం రావడం గమనార్హం. రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.