Breaking: భారీ భూకంపం
టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.2గా నమోదయింది. దీని ప్రభావంతో ఇస్తాంబుల్ లో ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు US జియో లాజికల్ సర్వే తెలిపింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.