పరీక్ష తేదీలు విడుదల
ఈ నెల 29 నుంచి మే 4 వరకు తెలంగాణలో EAPCET పరీక్షలు జరగనున్నాయి. 29, 30 తేదీలో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు, మే 2నుంచి 4వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్షకు ఒక నిమిషం నిబంధనను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.