1 నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం
హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో నగరంలో సన్న బియ్యం పంపణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 1 నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనుంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. కాగా ఇప్పటికే గోదాముల నుంచి నగరంలోని 653 రేషన్ దుకాణాలకు అధికారులు బియ్యం సరఫరా చేస్తున్నారు.