దేవుడా శాడిస్టులు ఇలా కూడా ఉంటారా..!

News Published On : Sunday, February 2, 2020 01:09 PM

చైనాలోని కరోనా వైరస్ వ్యాపించి చాలామంది ఆ వైరస్ వలన చనిపోయారు కూడా, అయితే ఇప్పుడు చైనాలోని కరోనా వ్యాపించిన రోగులు తమలోని శాడిజాన్ని బయటకు తీస్తున్నారు. ఈ వ్యాధిబారిన పడిన కొంతమంది బాధితులు ప్రజల్లో కలిసిపోయి. వారిపై ఉమ్ములు వేస్తూ, వారిపైన తుమ్ముతూ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు.

చైనాలోని ఓ హాస్పిటల్‌లో కరోనా వ్యాధి చికిత్సకు వచ్చిన ఓ బాధితుడు. రిసెప్షన్‌లో బిల్లు చెల్లిస్తూ అక్కడ ఉన్న సిబ్బందిపై ఉమ్ములు వేశాడు. ఈ ఘటన హాస్పిటల్‌లోని సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యింది. ఇలా చాలా మంది చేస్తున్నట్లు సమాచారం.దీంతో ఎవరికి వైరస్ ఉందో. ఎవరికి లేదో కూడా తెలియక ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. కనీసం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడానికి కూడా బయపడి చస్తున్నారు.