పదో తరగతి ఫలితాలు.. ప్రభుత్వం కీలక ప్రకటన

News Published On : Monday, April 21, 2025 10:20 PM

ఏపిలో పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23వ తేదీ ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది.

అభ్యర్థుల ఫలితాలు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లు, 'మన మిత్ర' (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు. అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...