ఉగ్రదాడి: ఏపీ, తెలంగాణలో హైఅలర్ట్.. క్లారిటీ
పహల్గామ్ దాడి నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని 14 ప్రాంతాలను పోలీసులు హైఅలర్ట్ జోన్లుగా ప్రకటించారని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై తెలంగాణలో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇది ఫేక్ అని స్పష్టం చేసింది. ఎలాంటి స్పెషల్ అలర్ట్ జారీ చేయలేదని, పోలీసులు ముందు జాగ్రత్తగా బహిరంగ ప్రదేశాలలో నిఘా పెంచారని పేర్కొంది. ఏవైనా భద్రతా ఏర్పాట్లు ఉంటే DGP ఆఫీసు నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రకటించింది.