ఉబర్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. యూజర్ల దగ్గర నుంచి త్వరితగతిన బుకింగ్ కోసం టిప్స్ వసూలు చేస్తుందని యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చేయడం అనైతికమని యూజర్లు తెలిపారు. అయితే దీనిపై తాజాగా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) స్పందిస్తూ ఉబర్ కు నోటీసులు జారీ చేసింది.