నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు..!
వివాదాస్పద నటి శ్రీరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కాకినాడలో ఆమెపై కేసు నమోదైంది. ప్రతిపక్షంలో ఉండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేశారంటూ శ్రీరెడ్డిపై టీడీపీ మహిళ నేతలు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. కాకినాడ జగన్నాథపురానికి చెందిన టీడీపీ మహిళ నాయకురాలు కొప్పనాతి నాగకుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు.