ఎమ్మెల్యేపై కేసు నమోదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తనను భర్తను బెదిరించి కౌశిక్ రెడ్డి రూ.25 లక్షలు తీసుకున్నాడని, మరోసారి ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఉమాదేవి అనే మహిళ సుభేదారి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే తన ఫ్యామిలీ అంతటిని చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై 308(2), 308(4), 352 బీఎన్ఎస్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.