చంద్రబాబుపై కేసు ఎత్తివేత
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. YCP అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు పైన పలు కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కూడా అయ్యారు. కాగా నాటి కేసుల విషయంలో ప్రస్తుతం నిర్ణయాలు జరుగుతున్నాయి. ఆయనపై అన్నమయ్య జిల్లా అంగళ్లులో అక్రమంగా బనాయించిన కేసులను పోలీసులు ఎత్తివేశారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనపై చేసినవి తప్పుడు ఫిర్యాదులుగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు నివేదించినట్లు సమాచారం.