కలెక్టర్ కార్యాలయాలకు బాంబు బెదిరింపు
వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో బుధవారం బాంబులు పెట్టినట్టు ఆగంతకుడు డీసీపీ ఆఫీస్ కు మెయిల్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన వరంగల్ పోలీసు కమిషనరేట్ బాంబు, డాగ్ స్కాడ్ సిబ్బంది రెండు జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలకు చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేశారు. తనిఖీల తరువాత ఆ బెదిరింపు ఫేక్ గా పోలీసులు నిర్ధారించారు. బాంబు బెదిరింపుతో కలెక్టరేట్ ఉద్యోగులు ఆందోళన చెందారు.