విమాన ప్రమాదం: 27 గంటల తర్వాత దొరికిన బ్లాక్ బాక్స్

News Published On : Friday, June 13, 2025 08:57 PM

విమాద ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించే బ్లాక్ బాక్స్ ఈ రోజు లభ్యమైంది. విమానం ఢీకొట్టిన డాక్టర్స్ హాస్టల్ పైకప్పుపై ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్టు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. విమానం వేగం, ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, కాక్పిట్ అడియా వంటి కీలక సమాచారం ఈ బ్లాక్బాక్స్లో ఉంటుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణలు రికార్డవుతాయి.