ఉగ్రదాడి ఎఫెక్ట్: జాగ్రత్త పడుతున్న బెంగళూరు

News Published On : Friday, April 25, 2025 07:43 PM

కశ్మీర్ ఉగ్ర దాడి తర్వాత కర్ణాటక సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యంగా బెంగళూరులో భద్రతను పటిష్టం చేసుకునేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం పాకిస్తాన్‌ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. పాక్‌ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. మెడికల్‌ వీసాలకు మాత్రం ఏప్రిల్‌ 29 వరకు అనుమతి ఇచ్చారు. 

మరో వైపు భారత పౌరులు పాకిస్తాన్‌ వెళ్లరాదని కేంద్రం సూచించింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి, పాకిస్థానీయులను వెంటనే పంపించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే కర్ణాటక పోలీసులు పాకిస్తాన్ నుండి అక్రమ వలసదారులను, స్లీపర్ సెల్స్‌ను వెతికే పనిలో పడ్డారు. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తానీ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించకుండా నిషేధించాలన్న కేంద్రం ఆదేశాలను అనుసరించి, చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని వారిని గుర్తించి బహిష్కరించడంలో కర్ణాటక ప్రభుత్వం అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటుందని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర వెల్లడించారు. అక్రమ నివాసితులపై ఉచ్చు బిగించడంతోపాటు సరైన డాక్యుమెంటేషన్ లేని పాకిస్తాన్ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పరమేశ్వర తెలిపారు. “కేంద్ర నిఘా సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను గుర్తించి, అదుపులోకి తీసుకుని, బహిష్కరణ కోసం వారిని హైకమిషన్‌కు అప్పగిస్తామని ఆయన చెప్పారు.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...