భారత సైన్యం రక్షణ కోసం కొత్త పద్ధతి
భారతదేశానికి సరిహద్దుల్లో తేనెటీగలు సైన్యానికి సహాయం చేస్తున్నాయి. సరిహద్దుల భద్రత, రక్షణల కోసం తేనెటీగల్ని సైన్యం పెంచుతోంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోడానికి సరిహద్దు భద్రతా దళం తేనెటీగలను ఉంచింది. పశ్చిమ బెంగాల్ లోని నాడియా జిల్లాలో బీఎస్ఎఫ్ సైన్యం ముళ్లతీగల కంచెల వద్ద పెట్టెల్ని వేలాడదీసి వాటిల్లో తేనెటీగల్ని పెంచుతోంది. ఎవరైనా ఆ కంచెలను కదిలించినప్పుడు తేనెటీగల గుంపు దాడి చేస్తాయి.