500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
బ్యాంక్ ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా తమ బ్రాంచ్ ఖాళీగా ఉన్న 500 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ఏపీలో 22, తెలంగాణలో 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుండి 26 ఏళ్లలోపు టెన్త్ పాసైన, స్థానిక భాష చదవడం, రాయడం వచ్చిన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కేటగిరి బట్టి వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి రూ.19500 నుండి రూ.37,815 వరకు జీతం చెల్లిస్తారు. వివరాలకు బ్యాంకు వెబ్ సైట్ ను సందర్శించండి.