హాల్ టికెట్లు విడుదల
గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 తేది వరకు ఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మెయిన్స్ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలని ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. కాగా 81 ఉద్యోగాల కోసం నిర్వహించే మెయిన్స్ కు 4,496 మంది అర్హత సాధించారు.