తీరు మారని విద్యా శాఖ - నిరుద్యోగులతో చెలగాటం

News Published On : Wednesday, February 20, 2019 09:38 AM

(వ్యాసకర్త : సి రెడ్డి వరప్రసాద్, అనంతపురం జిల్లా)

ఇటీవల ప్రభుత్వం మొక్కు బడిగా నిర్వహించిన DSC -2018 లెక్క లేనన్ని  తప్పులు తడకలుగా ఉంది. ఏ ప్రభుత్వం అన్నా ఎలక్షన్స్ ముందు ఎక్కువ పోస్టులుతో నోటిఫికేషన్ ఇస్తుంది కానీ మన ప్రభుత్వం సుమారు 20 వేల టీచర్ పోస్టులుతో నోటిఫికేషన్ త్వరలో ఇస్తున్నామని 2017 డిసెంబర్ లో ప్రకటించి చివరికి మొక్కుబడిగా 7902 పోస్టులుతో DSC-2018 నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకుంది. పరీక్ష నిర్వహణలోను విద్యా శాఖ ౦౩ సార్లు వాయిదా పర్వం నడిపించి 4 వ సారి ఆన్లైన్ నందు నిర్వహించటం జరిగింది. కనీసం ఈ అరకొర పోస్టులుకన్నా సరైన విధంగా పరీక్ష నిర్వహించిందా అంటే, అందులోను చాలా తప్పులు తడకలు ఉన్నాయి. అందులో మచ్చుకు కొన్ని ఉదాహరణలు....

DSC అభ్యర్థులు అందరూ ONLINE లో పరీక్షలు వద్దంటూ ఎంత మొర పెట్టుకున్నా సరే ప్రభుత్వం వినకుండా DSC పరీక్షలను ONLINE లో వివిద సెషన్స్ లో నిర్వహించింది. దీని వలన పరీక్ష పేపర్స్ లో సప్రమానత లోపించి కొన్ని సెషన్స్ వారికి పేపర్స్ చాలా ఈజీ గాను, మరికొన్ని సెషన్స్ వారికి పేపర్స్ చాలా కష్టంగాను వచ్చాయి. ఈ కారణంగా నిజమైన మెరిట్ అభ్యర్థులు కి అన్యాయం జరగటం సాధారణం కాబట్టి, కొన్ని ప్రత్యామ్న్యాయ పద్దతులను ఉదా: నార్మలైజషన్ లాంటి వాటిని అవలంబించటం ద్వారా ఈ పరీక్షా పేపర్ల లోని అసమానతలను రూపు మాపటం జరుగుతుంది. నిజానికి , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలైన JEE ,GATE , IBPS ,RRB నందు నార్మలైజషన్ చేయటం సర్వ సాధారణం. ఈ విధంగా DSC పేపర్స్ అన్నింటిని నార్మలైజషన్ చేసి ఫలితాలు విడుదల చేస్తే అందరికీ సమన్యాయం జరుగుతుంది. కానీ అందరిదీ ఒక రూట్ తనది మాత్రమే ఒక రూట్ అన్న చందంగా విద్యా శాఖ, ఎటువంటి నార్మలైజషన్ చేయకుండానే మెరిట్ లిస్ట్ ను ఆర్బాటంగా 15 .02 .2019 న విడుదల చేయటం జరిగింది. దీని ద్వారా నియామక వ్యవస్థ నందు ఒక ప్రమాదకరమైన అసమతుల్యాన్ని ప్రవేశ పెట్టటం జరిగింది. బాల్యం లో ఎవరైనా ఏమవుతావ్ అని ఉపాద్యాయుడో/ఉపాధ్యాయురాలో అడిగితే, అందరు డాక్టర్ నవుతా, ఇంజనీర్ నవుతా, లాయర్ నవుతా అని చెప్తుంటే, వీళ్ళందరూ కాదు, వీళ్ళందర్నీ తయారు చేసే టీచర్ నవుతా అని చెప్పిన ఎంతో మంది అభ్యర్థుల పరిస్థితి ని ఇప్పుడిలా చూస్తున్నందుకు సిగ్గు గా, బాధ గా వుంది. 

ఇలా ఒంటెద్దు పోకడలతో ఫలితాలను ప్రకటించి, నియామక వ్యవస్థ యెక్క ప్రాథమిక ప్రాథమిక ఉద్దేశానికే తిలోదకాలివ్వటం మన విద్యా శాఖ పని తీరు కి నిదర్శనం. మూలిగే నక్క మీద మీదే తాటి పండు పడ్డట్టు, అసలే నార్మలైజషన్ చేయక వెంట్రుక వాసి లో అవకాశం కోల్పోయిన ఆశావహ అభ్యరథుల మీద ఆడ్ స్కోర్ అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత నిరుత్సహానికి గురి చేసింది. సాధారణంగా, నియామక పరీక్షా ఒకే రోజున జరిగినట్లయితే ఆడ్ స్కోర్ ప్రభావం అందరి మీద ఒకేలా ఉండేది, కానీ వివిధ సెషన్స్ నందు పరీక్షలు రాయటం మూలంగా అదృస్టవశాత్తు సులభంగా వచ్చిన సెషన్ల వాళ్ళకే ఎక్కువ లాభం చేకూరి సమ న్యాయం అన్న పదానికే నియామక వ్యవస్థ నందు స్థానం లేకుండా చేసింది. సాధారణంగా అలాంటి పరిస్థితి వచ్చినపుడు స్కేలింగ్ పద్దతి అమలు చేయటం రివాజు (ఉదా: APPSC). స్కేలింగ్ అమలు చేయటం లో కూడా అన్ని కరెక్ట్ గా సమాధానాలను రాసిన అబ్యర్ధులకు మాత్రమే గరిష్టంగా లాభం చేకూరి నియామక వ్యవస్థ మరింత పారదర్శకతవంతంగా తయారు అవుతుంది. కానీ, సులభంగా వచ్చిన పరీక్షా రాసిన వారందరికీ ఆడ్ స్కోర్ కలపటం వల్ల ఆ సులభమైన పరీక్ష రాసిన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఇదిలా ఉంటే, కేంద్రాల ఎంపిక లో కూడా పారదర్శకత ఉన్నదా అనేది కూడా అనుమానమే ఉదా: పరీక్షా కేంద్రం ఎంపిక కోసం ఆప్షన్స్ స్వీకరించినపుడు చాలా మంది అభ్యర్ధులు ముందుగా ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ, చాలా ఆలస్యంగా అదే పరీక్షా కేంద్రంను కేటాయించారన్న ఆరోపణులున్నాయి . ఇలా తలా తోక లేకుండా ఏక పక్ష నిర్ణయాలతో వ్యవహరించాలనుకున్నపుడు పరీక్ష పెట్టడం ఎందుకు, తిన్నగా లాటరి తీసేసి ఇచ్చేస్తే సరిపోయేది కదా అని చాలా మంది నిరుద్యోగులు మండిపడుతున్నారు. 

ప్రతి శాఖా , తనకున్న వనరుల లోబడి, వీలైనంత సమాచారాన్ని అధికారిక వెబ్ సైట్ నందు పొందు పరచాలన్న సమాచార హక్కు చట్టం - 2005 ,సెక్షన్ 4.A నియమాన్ని పాటించటం సంగతి అటుంచితే, అరకొర సమాచారం పెట్టి తప్పుదోవ పట్టించటం మన పాలకుల ప్రావీణ్యాన్ని ప్రపంచానికే చాటి చెప్తోంది. ఏ పరీక్ష ఫలితాలలో ఐనా పుట్టిన పుట్టిన తేదీ లేని మెరిట్ లిస్ట్ బహుశా మన DSC -2018 లోనే మనం చూడవచ్చు. విచిత్రం ఏమిటంటే DSC -2014 మెరిట్ లిస్ట్ నందు మాత్రం పుట్టిన తేదీని పెట్టిన విషయం తెలీకపోవటం బహుశా విద్యాశాఖ మతి మరుపుకు నిదర్శనం. 

త్వంవ DSC పరీక్ష పత్రాలకి సంబంధించి ముందుగా విడుదల చేసిన intial key లో దొర్లిన తప్పులు పై DSC అభ్యర్థులు సరి అయిన ప్రభుత్వ టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ తో objections పెట్టినప్పటికీ ఫైనల్ కీ లో కూడా చాలా తప్పులు పునరావృతమయ్యాయి.